తిరుపతిలో ప్రభుత్వ చౌకధరల దుకాణం నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. నగరంలోని రైల్వే కాలనీలో ప్రభుత్వ చౌకధరల దుకాణాల నుంచి సేకరించిన 17.5 టన్నుల బియ్యాన్ని లారీలో లోడ్ చేస్తుండగా...పోలీసులు పట్టుకున్నారు. 701 బస్తాల బియ్యం, లారీ సీజ్ చేశారు.
తిరుపతి నుంచి కడప జిల్లా రాయచోటికి బియ్యాన్ని తరలిస్తున్నట్లుగా గుర్తించారు. తిరుపతికి చెందిన కిశోర్ కుమార్, రాయచోటికి చెందిన సయ్యద్ నన్నే సాహెబ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అక్రమ రవాణాతో సంబంధం ఉన్న మరికొంత మంది కోసం గాలిస్తున్నామని... పోలీసులు చెప్పారు. వీలైనంత త్వరలో వారినీ అరెస్ట్ చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: