ప్రత్యేక ఆహ్వానితుల నియామకాన్ని సవాలు చేస్తూ.. దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాల్లో తితిదే కౌంటర్ వేసేందుకు హైకోర్టు నాలుగు వారాల సమయం ఇచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్రా, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్తో కూడిన ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులిచ్చింది. తితిదే ప్రత్యేక ఆహ్వానితులుగా 52 మందిని నియమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై సెప్టెంబర్ 22న విచారణ జరిపిన హైకోర్టు.. వాటి అమలును నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు హైకోర్టులో మరోసారి విచారణకు రాగా.. కౌంటర్ వేసేందుకు తితిదే తరపు సీనియర్ న్యాయవాది ఎస్ఎన్ ప్రసాద్ సమయం కోరారు. దీనికి అంగీకరించిన న్యాయస్థానం.. కౌంటర్ వేసేందుకు హైకోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చింది.
ఇదీ చదవండి..Contract employes : ఒప్పంద ఉద్యోగుల సర్వీసు పొడిగింపు... ప్రభుత్వ ఉత్తర్వులు