తిరుమల శ్రీవారిని సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న తేజ్‌కి.. దర్శనానంతరం ఆలయ సిబ్బంది స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రతి సినిమా విడుదల ముందు శ్రీవారి ఆశీస్సులు పొందడం తనకు అలవాటన్న సాయి ధరమ్ తేజ్.. ఈ నెల 25న విడుదలయ్యే "సోలో బతుకే సో బెటర్" చిత్రాన్ని అందరూ థియేటర్లలోనే చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: చలిని లెక్కచేయకుండా.. సాగుతున్న రైతన్న పోరాటం