ETV Bharat / city

'బర్డ్​'లో చికిత్సకు డబ్బులు కట్టాల్సిందే - తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో చికిత్సకు డబ్బులు

రోజుకు 30కిపైగా శస్త్ర చికిత్సలు.. వేలసంఖ్యలో అవుట్‌ పేషెంట్లు.. 350 పడకలు.. వచ్చే రోగులు, వారి బంధువులు.. కీళ్ల ఆపరేషన్‌ చేయించుకోవాలంటే 4 ఏళ్లు వేచిచూడాల్సినంత రద్దీ.. ఇదీ ఒకప్పుడు తిరుపతి బర్డ్ ఆసుపత్రి ప్రస్థానం. అలాంటి ఈ ఆసుపత్రి ఇప్పుడు రోగులు లేక వెలవెలబోతోంది. ఆరోగ్యశ్రీ పరిధిలో లేని వైద్యసేవలకు సొమ్ము వసూలు చేస్తుండడం వల్ల పేద రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోకాలు, తుంటి కీలు మార్పిడి శస్త్రచికిత్సలకు ప్రసిద్ధిగాంచిన 'బర్డ్​'లో .. ఇప్పుడు ఆ ఆపరేషన్లకు డబ్బులు వసూలు చేయాలని తితిదే తీసుకున్న నిర్ణయంతో పేదరోగులు ఆసుపత్రి గడప తొక్కలేని పరిస్థితి నెలకొంది.

Here after No free operations in tirupathi bird hospital
తిరుపతి బర్డ్ ఆసుపత్రి
author img

By

Published : Feb 9, 2020, 12:26 PM IST

Updated : Feb 9, 2020, 1:18 PM IST

తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో నిలిచిన ఉచిత వైద్య సేవలు

తితిదే నిర్వహణలో ఉన్న 'శ్రీ బాలాజీ దివ్యాంగుల శస్త్రచికిత్స పరిశోధన, పునరావాస కేంద్రం(బర్డ్)' నిరుపేదలకు ఉచిత వైద్యసేవలు అందించడంలో ప్రసిద్ధి గాంచింది. ఎముకలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేయించుకునేందుకు మన రాష్ట్రంవారే కాక ఉత్తరాది రాష్ట్రాల పేదరోగులూ వస్తుంటారు. తెల్లరేషన్‌ కార్డు ఉన్నవారికి తుంటి, మోకీలు మార్పిడితోపాటు ఎముకలకు సంబంధించి ఎలాంటి వైద్యమైనా ఉచితంగా చేసేవారు. వీటి శస్త్రచికిత్స కోసం బాధితులు 3, 4 ఏళ్లు వేచి చూడాల్సినంత రద్దీ ఉండేది.

నిలిచిన ఉచిత వైద్యసేవలు

కొంతకాలంగా బర్డ్‌ ఆసుపత్రిలో ఉచిత వైద్యసేవలు నిలిపివేశారు. ప్రైవేటు ఆసుపత్రుల తరహాలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న వ్యాధులకే ఉచిత శస్త్రచికిత్సలు చేయాలని తితిదే యంత్రాంగం నిర్ణయించింది. దీని వల్ల ఆరోగ్యశ్రీ పరిధిలో లేని మోకాళ్ల మార్పిడి, తుంటి ఎముకల శస్త్రచికిత్స పరికరాలు రోగులే కొనుగోలు చేయాల్సివస్తోంది. అందుకు వారి ఆర్థికస్థితి సహకరించక పేద రోగులు నిరాశగా వెనుదిరుగుతున్నారు.

ఆసుపత్రి అభివృద్ధి కోసమే

బర్డ్‌ ఆస్పత్రి నిర్వహణకు తితిదే ఏటా రూ.50 కోట్లు నిధులు కేటాయిస్తోంది. వీటిలో అధిక మొత్తం మోకీళ్లు, తుంటి ఎముకల శస్త్రచికిత్సల పరికరాల కోసం వినియోగిస్తున్నందున.. ఆసుపత్రి అభివృద్ధి ఆగిపోతుందని తితిదే భావించింది. స్వదేశీ మోకాలుకు రూ.38 వేలు, విదేశీ మోకాలుకు రూ.84 వేలు వసూలు చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా సమకూరే మొత్తంతోపాటు తితిదే కేటాయించే నిధులతో ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.

బర్డ్‌ ఆస్పత్రిలో ఉచిత శస్త్రచికిత్సలు ఆగిపోవటంతో.. గతంలో పరీక్షలు పూర్తిచేసుకొని ఆపరేషన్‌ కోసం ఎదురుచూస్తున్న వారు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. డబ్బులు పెట్టి శస్త్రచికిత్సలు చేసుకోలేని పేదరోగులకు తితిదే ప్రాణదాన ట్రస్టు కింద అయినా ఉచితంగా వైద్యం చేయాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ఆక్వాపై కరోనా వైరస్ ప్రభావం.. తగ్గిన చేపలు, రొయ్యల ధరలు

Last Updated : Feb 9, 2020, 1:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.