లక్ష్మీకాసుల హారంతో అమ్మవారి దర్శనం - goddess tiruchanur brahmotsavam
తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా పద్మావతి అమ్మవారు... గజవాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు.

లక్ష్మీకాసుల హారంతో అమ్మవారి దర్శనం
తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజు అమ్మవారి ప్రీతిపాత్రమైన గజవాహన సేవలో మాఢవీధుల్లో విహరించారు. శ్రీవారి లక్ష్మీకాసుల హారం ధరించి గజవాహనంపై ఆసీనురాలై... భక్తులకు దర్శనమిచ్చారు. కర్పూర హారతులతో అమ్మవారికి నీరాజనాలు పలికారు. భక్త బృందాల కోలాటాలు, మంగళవాయిద్యాలు, వేషధారణలు ఆకట్టుకున్నాయి. గురువారం అమ్మవారికి జరగనున్న గరుడ వాహన సేవ, ఆదివారం నిర్వహించే పంచమి తీర్థాన్ని పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లు చేసినట్లు తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
లక్ష్మీకాసుల హారంతో అమ్మవారి దర్శనం
ఇదీ చదవండి :
Last Updated : Nov 27, 2019, 11:24 PM IST