తెలంగాణ జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయ పరిసరాల్లో తిండి లేక కోతులు అల్లాడుతున్నాయి. దర్శనానికి వచ్చే భక్తులు కోతుల్లో అంజన్నను చూసుకొని పండ్లు, ఫలహారాలు అందించేవారు. లాక్‌డౌన్ కారణంగా ఎవరూ రావడం లేదు. దీంతో కొందరు రెండు రోజులుగా ఆహారం అందిస్తున్నారు. మల్యాల మార్కెట్ ఛైర్మన్ శ్రీనివాస్, ప్రతాప కృష్ణారావు ఇవాళ కోతులకు ఆహారం అందించారు. తిండి లేక కడుపు కాలుతున్న కోతులు ఒక్కసారిగా గుంపులుగా చేరాయి. వాటికి రోజు ఆహారం అందించేందుకు సహకరించాలని ఆంజనేయ స్వామి భక్తులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: పారిశుద్ధ్య కార్మికురాలి కాళ్లు కడిగిన చిన్నారులు