తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, తెలంగాణ ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, శ్రీనివాస్ రావు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ప్రముఖులకు ఆలయ ఆధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఇదీ చదవండి: TIRUMALA: శ్రీవారిని దర్శించుకున్న 15,900 మంది భక్తులు