ETV Bharat / city

దేశ అవసరాలు తీర్చడంలో 'దూద్‌ దురం'తో కీలకపాత్ర: ద.మ రైల్వే

రేణిగుంట నుంచి దేశ రాజధాని న్యూదిల్లీకిదూద్ దురంతో రైళ్ల ద్వారా పది కోట్ల లీటర్ల పైచిలుకు పాలను సరఫరా చేసినట్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ పేర్కొంది. లాక్​డౌన్​లోనూ ఈ రైలు ద్వారా పాల సరఫరా జరిపినట్లు తెలిపింది. దేశ అవసరాలను తీర్చడంలో దూద్ దురంతో రైళ్లు కీలక పాత్ర పోషించాయని.. అధికారులు పేర్కొన్నారు.

దూద్‌ దురంతో
దూద్‌ దురంతో
author img

By

Published : Aug 10, 2021, 9:19 PM IST

దూద్‌ దురంతో ప్రత్యేక రైళ్ల ద్వారా.. రాష్ట్రంలోని రేణిగుంట నుంచి దేశ రాజధాని న్యూదిల్లీకి పాల సరఫరా నిరంతరంగా కొనసాగుతుందని రైల్వేశాఖ వెల్లడించింది. నేటి వరకు దూద్ దురంతో రైళ్ల ద్వారా పది కోట్ల లీటర్ల పైచిలుకు పాలను సరఫరా చేసినట్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ పేర్కొంది. లాక్​డౌన్​లోనూ ఈ రైలు ద్వారా పాల సరఫరా జరిపినట్లు తెలిపింది. ప్రారంభంలో కొంత ఆలస్యంగా రైళ్లు నడిచినప్పటికీ.. ప్రస్తుతం మాత్రం అత్యంత వేగంగా రైళ్లను నడిపిస్తూ.. సరైన సమయంలో గమ్యస్థానాలకు పాలను చేరవేస్తున్నామని ద.మ. రైల్వేశాఖ చెప్పింది.

443 ట్రిప్పులు..

గత ఏడాది మార్చి 26న ప్రారంభమైన ఈ రైలు సర్వీసు.. నేటీకి కూడా నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 443 ట్రిప్పుల ద్వారా 2,502 పాల ట్యాంకర్లను రవాణా చేశామని దక్షిణ మధ్య రైల్వేశాఖ తెలిపింది. రాష్ట్రంలోని రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి న్యూదిల్లీకి పాలను నిర్విరామంగా పంపిణీ చేస్తున్నామని రైల్వేశాఖ వెల్లడించింది. దేశ అవసరాలను తీర్చడంలో దూద్ దురంతో రైళ్లు కీలక పాత్ర పోషించాయని.. అధికారులు పేర్కొన్నారు.

2,300 కి.మీల దూరాన్ని కేవలం 30 గంటల్లోనే..

ప్రారంభంలో వారాంతపు సూపర్‌ఫాస్ట్‌ రైళ్లకు పాల ట్యాంకర్లను అనుసంధానించేవారు. లాక్‌డౌన్‌ విధించిన తర్వాత దిల్లీ ప్రజల పాల అవసరాలను తీర్చడానికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక పాల ట్యాంకర్లతో కూడిన దూద్‌ దురంతో ప్రత్యేక రైళ్లను ద.మ. రైల్వే ప్రారంభించింది. ఈ రైళ్లకు మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతో సమ ప్రాధాన్యత ఇస్తూ రేణిగుంట నుంచి హజ్రత్​ నిజాముద్దీన్‌ స్టేషన్‌ వరకు గల 2,300 కి.మీల దూరాన్ని కేవలం 30 గంటలలో చేరుకునే విధంగా వీటి నిర్వహణ చేపట్టారు.

దూద్‌ దురంతో ప్రత్యేక రైలులో ఒక పాల ట్యాంకరు 40 వేల లీటర్ల సామర్థ్యంతో మొత్తం 6 పాల ట్యాంకర్లతో నడిపిస్తున్నారు. ఒక రైలులో మొత్తం 2.40 లక్షల లీటర్ల పాల సరఫరా జరుగుతోంది. దూద్‌ దురంతో ప్రత్యేక రైళ్ల ద్వారా ఇప్పటి వరకూ 443 ట్రిప్పులలో 2,502 పాల ట్యాంకర్లతో 10 కోట్ల లీటర్లకుపైగా పాల సరఫరా జరిగినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

SCHOOLS REOPEN: ఈ నెల 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

గుజరాత్​ నుంచి తిరుమలకు పాదయాత్ర.. 70+ ఏజ్​లో...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.