తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలపై.. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 14 నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతిని ఇచ్చింది. ఆర్జిత సేవా టికెట్లున్నవారు మూడు రోజుల ముందు కరోనా పరీక్షలు చేసుకుని.. వైకుంఠం కాంప్లెక్స్ వద్ద కరోనా నెగిటివ్ రిపోర్ట్ చూపాలని సూచించింది.
కరోనా దృష్ట్యా ఏడాదిగా.. ఏకాంతంగా ఆర్జిత సేవలు నిర్వహించిన తితిదే.. ఉత్సవమూర్తులకు నిర్వహించే సేవల్లో భారీ మార్పులు చేసింది. ఇకపై ఏడాదికోసారి విశేష పూజ, సహస్ర కళశాభిషేకం, ఏడాదికోసారి సాలకట్ల ఉత్సవంగా వసంతోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉత్సవమూర్తుల పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: