ETV Bharat / city

భక్తుల సొమ్ము.. గోవిందా.. గోవింద!

author img

By

Published : Nov 4, 2019, 5:30 AM IST

తిరుమలలో దళారుల వేట కొనసాగుతోంది. కొంత కాలంగా భక్తులను మోసగిస్తున్న వారిపై తితిదే విజిలెన్స్‌ కన్నెర్ర చేస్తోంది. శ్రీవారి దర్శన టిక్కెట్లు, గదులు, ప్రసాదాలు... ఇలా అన్ని చోట్లా నిఘా పటిష్ఠం చేశారు. మోసగాళ్ల  సమాచారం కోసం వినూత్నంగా ప్లకార్డులతో ప్రచారం చేస్తున్నారు. దళారులకు సహకరిస్తున్న తితిదే ఉద్యోగులపైనా చర్యలు చేపట్టారు.

devotees cheated by mediators in tirumala temple

తిరుమల శ్రీవారి దర్శనం, ప్రసాదం, గదుల విషయంలో మోసాలకు పాల్పడుతూ భక్తులను దోచుకుంటున్న దళారులపై వేట కొనసాగుతోంది. భక్తులను మోసగిస్తున్న వారిపై తితిదే విజిలెన్స్‌ కన్నెర్ర చేస్తోంది. శ్రీవారి దర్శన టిక్కెట్లు, గదులు, ప్రసాదాలు... ఇలా అన్ని చోట్లా నిఘా పటిష్ఠం చేశారు. మోసగాళ్ల సమాచారం కోసం వినూత్నంగా ప్లకార్డులతో ప్రచారం చేస్తున్నారు. దళారులకు సహకరిస్తున్న తితిదే ఉద్యోగుల పైనా.. చర్యలు చేపట్టారు.

ప్రముఖుల పేరుతో..

ఇప్పటి వరకూ.. 200 మందికిపైగా దళారులను పట్టుకుని వారిపై చర్యలు తీసుకున్నారు. చోడవరం ఎమ్మెల్యే పీఆర్వోగా తిరుమలలో పనిచేస్తున్న కల్లూరి రాజు..... తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్సీ సిఫార్సు లేఖతో వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను పొందాడు. తెలంగాణలోని కరీంనగర్ భక్తులకు అధిక ధరకు విక్రయించాడు. గత నెల గూడూరు ఎమ్మెల్యే సిఫార్సు లేఖపై శ్రీనివాసులు అనే దళారి వీఐపీ బ్రేక్‌ దర్శనం టిక్కెట్లను పొంది చెన్నై, బెంగళూరుకు చెందిన ఐదుగురు భక్తులకు 35 వేల రూపాయలకు విక్రయించాడు. ఇందులో తితిదే ఉద్యోగులతోపాటు పొరుగు సేవల సిబ్బంది పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు.

దళారులతో భక్తుల సొమ్ము.. గోవిందా.. గోవింద!

185 సిఫారసు లేఖలు

ఇటీవల పట్టుబడిన నలుగురు దళారుల విచారణలో నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. కాకినాడ, బెంగళూరుకు చెందిన నలుగురు భక్తులకు 17 వేలకు బ్రేక్ దర్శన టికెట్లు విక్రయించిన అక్రమార్కులను గత నెల 21న అదుపులోకి తీసుకున్నారు. వీరు ఏపీ, తెలంగాణకు చెందిన దాదాపు 46 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పరిచయాలు పెట్టుకుని వారి సిఫారసు లేఖలతో వీఐపీ బ్రేక్ టికెట్లు పొందుతున్నట్టు విచారణలో తెలిసింది. దాదాపు 185 సిఫారసు లేఖలపై టికెట్లు పొంది వాటిని అధిక ధరలకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.

దళారులపై కఠిన వైఖరి తప్పదన్న తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి ఒత్తిళ్లు వచ్చినా.. భక్తులను మోసగిస్తే క్షమించవద్దని తేల్చిచెప్పారు. దళారుల సమాచారం అందివ్వాలంటూ వైకుంఠం క్యూ కాప్లెక్స్‌ వద్ద విజిలెన్స్‌ అధికారులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు.

ఇదీ చదవండి: తిరుమల శ్రీవారి ఆలయంలో... పుష్పయాగ మహోత్సవానికి ఏర్పాట్లు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.