తిరుమల శ్రీవారి దర్శనం కోసం సీఎం వైఎస్ జగన్ డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సిన అవసరం ఏంటని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి ప్రశ్నించారు. అలిపిరి పాదాల మండపం వద్ద తితిదే, రిలయన్స్ సౌజన్యంతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన...డిక్లరేషన్ వివాదంపై స్పందించారు. నుదుటన గోవింద నామాలు పెట్టుకుని శ్రీవారి ఆలయంలోకి సీఎం జగన్ వెళ్లారన్న నారాయణ స్వామి...అంతకంటే డిక్లరేషన్ ఏముంటందని వ్యాఖ్యానించారు. ఎస్సీలకు అధిక ప్రాధాన్యమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందన్న ఆయన...ప్రతిపక్షాలకు వేరే ఆస్కారం లేకనే గుడులు, గోపురాలపై రాజకీయాలకు చేస్తోందన్నారు
ఇదీ చదవండి