నవ్యాంధ్రప్రదేశ్లో విభజన హామీల అమలులో భాగంగా ఏర్పాటైన తిరుపతి ఐఐటీ... తొలిసారిగా శాశ్వత క్యాంపస్లో యువజనోత్సవాలను నిర్వహించుకుంది. ఏర్పేడు సమీపంలో రూపుదిద్దుకున్న శాశ్వత భవనాల్లో జరిగిన ఈ తిరుత్సవ్లో.. యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆటపాటలతో పాటు ప్రతిభను వెలికితీసేలా కార్యక్రమాలను నిర్వహించారు.
తిరుత్సవ్లో కృత్రిమ మేథ, ఆటోమేషన్, ఓఏటీ, రోబోటిక్ టెక్నాలజీ తదితర అంశాలపై జరిగిన సదస్సులు యువత మేధస్సుకు పదునుపెట్టాయి. ప్రత్యేకించి డ్రోన్ల వినియోగంపై అవగాహనను ద్విగుణీకృతం చేసేలా బయానిక్ బర్డ్ తరహా ఆవిష్కరణలు, వాటి ప్రాధాన్యత, వినియోగం తదితర అంశాలపై ఐఐటీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. టెక్ బైట్ పేరుతో సాగిన సదస్సులో.... భవిష్యత్లో ఎదురుకానున్న సవాళ్లపై నిపుణులు విద్యార్థులకు సలహాలు, సూచనలు అందచేశారు. తిరుత్సవ్లో భాగంగా జరిగిన ఆటపోటీలు సైతం ఐఐటీ ప్రత్యేకతను ఘనంగా చాటాయి. క్రైమ్ బస్టర్స్, యాంగ్రీ బర్డ్, ఫంకీ ఫీట్, మిస్ట్రరీ రన్ ఇలా వినూత్న రీతిలో సాగిన ఆటలు, పోటీలు విద్యార్థుల్లోని సృజనాత్మకతను చాటి చెప్పాయి.
యువజనోత్సవాలంటే కేవలం విద్యార్థుల వేడుకలకే పరిమితం కాకుండా మల్టీ లెర్నింగ్ టాస్కింగ్లా రూపొందిచవచ్చనే విధంగా తిరుపతి ఐఐటీ తిరుత్సవ్ను నిర్వహించారు.
ఇదీ చదవండి: