రాష్ట్రంలో దళితులపై దాడులు తారస్థాయికి చేరుకున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆగ్రహించారు. తిరుపతిలోని సీపీఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. శాంతిపురం మండలం రెడ్లపల్లిలో జరిగిన పరువు హత్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాంతర వివాహం చేసుకుందనే కారణంతో... తండ్రే కూతురును చంపటం దారుణమన్నారు. ఈ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు సరిగా లేదని అసంతృప్తి చెందారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 15 రోజుల్లో సర్కారు నుంచి ఎటువంటి స్పందన లేకుంటే... రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి