రాష్ట్రంలో అప్రజాస్వామ్య పరిపాలన కొనసాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(cpi Ramakrishna comments on ycp) ఆరోపించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. తిరుపతి సీపీఐ కార్యాలయంలో చిత్తూరు జిల్లా సమితి సభ్యుల శాఖ కార్యదర్శులతో నిర్వహించిన వర్క్‌షాప్‌లో రామకృష్ణ పాల్గొన్నారు. సీఎం జగన్ చెబుతున్న మూడు రాజధానులు ఎక్కడ ఉన్నాయో చూపించాలన్నారు. అమరావతి రైతులు చేపట్టే "న్యాయస్థానం నుంచి దేవస్థానం" మహా పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆయన డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారని రామకృష్ణ(cpi Ramakrishna on cm jagan) మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు, వృద్ధులకు పింఛన్లు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని.. అప్పు పుడితే తప్ప ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో సర్కార్ ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
CBN KUPPAM TOUR: కుప్పంలో చంద్రబాబు పర్యటన.. భారీగా తరలివస్తున్న కార్యకర్తలు