కొవిడ్ రోగులు మృతి చెందలేదని అనటం బాధాకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 23 మంది చనిపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొందని, వాస్తవ పరిస్థితులను వక్రీకరించిన కేంద్రమంత్రిపై 420 సెక్షన్ కింద కేసు పెట్టాలన్నారు. కేసీఆర్ అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని స్వాగతిస్తున్నామని నారాయణ అన్నారు. దళితుల సంక్షేమం విషయంలో కేసీఆర్ను చూసి జగన్ నేర్చుకోవాలన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్జుకోవటానికి రాజకీయ పోరాటం అవసరమని.. ఈ మేరకు ఆగష్టు నెలలో దిల్లీ వేదికగా ఆందోళన చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
ఇదీ చదవండీ.. Tdp leaders serious on Govt: 'వైకాపా దోపిడీని అడ్డుకుంటే.. దాడులు చేస్తారా?'