ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో... జాతీయ స్థాయిలో మూడో కూటమి ఏర్పాటవుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. తిరుపతిలోని పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన ఆయన... కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ లో భాజపా ఓటమి ఖాయమని నారాయణ అన్నారు.
కార్పొరేట్ సంస్థలతో ప్రధాని మోదీ లాలూచీ పడ్డారని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలో ఎందుకు చేర్చడం లేదన్నారు. ప్రశ్నిస్తే దేశద్రోహం, అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, సాగునీటిపై రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు సరికాదని అన్నారు.
ఇదీ చదవండి:
Chandrababu: 'మామిడి రైతులకు ధరల స్థిరీకరణ సంస్థ ఏర్పాటు చేయాలి'