మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న బిహార్ మాజీముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్‌కి ఇవ్వని బెయిల్... అదే తరహా కేసులో నిందితుడిగా ఉన్న సీఎం జగన్‌కి ఎలా వచ్చిందని కేంద్ర మాజీమంత్రి, తిరుపతి లోక్‌సభ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ ప్రశ్నించారు. తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన... బాలాజీ కాలనీ, నాలుగు కాళ్లమండపం, తిలక్రోడ్లలో ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన చింతామోహన్... ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇద్దరు వేర్వేరు వ్యక్తులకు రెండు వేర్వేరు న్యాయాలు ఎలా జరుగుతున్నాయని ప్రశ్నించారు. ప్రధాని మోదీకి, సీఎం జగన్‌కి ఉన్న సంబంధం ఏంటో ప్రజలకు స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. భాజపా, వైకాపా ఒకే నాణేనికి రెండు పార్శ్వాలని చింతా మోహన్ వ్యాఖ్యానించారు. వైకాపాకి ఓటేసినా... లబ్ధి చేకూరేది భాజపాకేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ మాత్రమే ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ... ఎస్‌ఈసీ అప్పీల్‌పై హైకోర్టులో విచారణ