ETV Bharat / city

CM Jagan On PRC: ఉద్యోగులకు సీఎం జగన్​ గుడ్​ న్యూస్​ - పీఆర్సీ

CM Jagan On PRC: పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని సీఎం జగన్​.. ఉద్యోగులకు హామీ ఇచ్చారు. తిరుపతిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటనలో ఉండగా.. పలువురు ఉద్యోగులు సీఎంను కలిశారు. ఈ సందర్భంగా పీఆర్సీపై స్పందించిన జగన్.. పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పారు.

సీఎం జగన్
సీఎం జగన్
author img

By

Published : Dec 3, 2021, 11:50 AM IST

Updated : Dec 3, 2021, 4:14 PM IST

CM Jagan announcement on PRC: పీఆర్సీపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 10 రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. తిరుపతి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలో ఉండగా.. కొందరు ఉద్యోగులు పీఆర్సీ గురించి ప్లకార్డులను ప్రదర్శించారు. వాటిని గమనించిన ముఖ్యమంత్రి.. వారిని పిలిచి మాట్లాడారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులు కోరారు. ఇందుకు స్పందించిన సీఎం జగన్.. పీఆర్సీ ప్రక్రియ పూర్తయ్యిందని చెప్పారు. 10 రోజుల్లో ప్రకటన ఉంటుందని వారికి తెలిపారు.

ఉద్యోగులకు సీఎం జగన్​ గుడ్​ న్యూస్​

సీఎం ప్రకటన గురించి తెలియదు - బొప్పరాజు
పీఆర్సీపై సీఎం జగన్ తాజా ప్రకటనపై ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు స్పందించారు. పీఆర్సీపై సీఎం చేసిన ప్రకటన గురించి ఉద్యోగులకు తెలియదన్నారు. తిరుపతిలో తమ సంఘాల ఉద్యోగులెవరూ ముఖ్యమంత్రిని కలవలేదని స్పందించారు. పీఆర్సీ ఒక్కటే ఉద్యోగుల డిమాండ్ కాదన్న ఆయన.. తమ డిమాండ్లు అన్నీ అంగీకరిస్తేనే పోరాటం విరమిస్తామని స్పష్టం చేశారు. పీఆర్సీ నివేదిక ఇస్తేనే దానిపై చర్చకు వీలు కలుగుతుందని చెప్పారు.

మరోసారి చర్చలకు పిలుపు..
Joint Staff Council meeting: పీఆర్సీ సహా ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతోంది. డిసెంబర్‌ 7 నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు ఉద్యోగ సంఘాలు కార్యాచరణ ప్రకటించిన నేపథ్యంలో.. చర్చలకు సర్కార్ ఆహ్వానించింది. సచివాలయంలో కార్యదర్శుల కమిటీతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఇవాళ సమావేశమయ్యారు. పీఆర్సీ నివేదికతోపాటు, డీఏ బకాయిలు, సీపీఎస్‌ రద్దు, ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాల పెంపు, కారుణ్య నియామకాలపై ఉద్యోగ సంఘాలు చర్చిస్తున్నాయి.

ఇదీ చదవండి: Govt Employees association demands to solve PRC issue: పీఆర్సీ సమస్యను పరిష్కరించకుంటే ఉద్యమ బాట పడతాం: ఆస్కార్‌రావు

Last Updated : Dec 3, 2021, 4:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.