ETV Bharat / city

CJI Justice NV Ramana tributes to Dollar Seshadri: 'డాలర్ శేషాద్రి లేని తిరుమలను ఊహించలేకపోతున్నా' - Dollar Seshadri

CJI Justice NV Ramana tributes to Dollar Seshadri: డాలర్ శేషాద్రి లేని తిరుమలను ఊహించలేకపోతున్నానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్వీ రమణ అన్నారు. 25 ఏళ్లుగా శేషాద్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. డాలర్ శేషాద్రి భౌతికకాయానికి నివాళులు అర్పించిన సీజేఐ.. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

CJI Justice NV Ramana tributes to Dollar Seshadri

author img

By

Published : Nov 30, 2021, 2:03 PM IST

డాలర్ శేషాద్రి భౌతికకాయానికి నివాళులు అర్పించిన సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ

CJI Justice NV Ramana tributes to Dollar Seshadri: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి భౌతికకాయానికి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నివాళులర్పించారు. శేషాద్రి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 25 ఏళ్లుగా శేషాద్రితో అనుబంధం ఉందన్న జస్టిస్ ఎన్వీ రమణ.. డాలర్ శేషాద్రి లేని తిరుమలను ఊహించలేకపోతున్నానన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన సంప్రదాయాలను డాలర్ శేషాద్రి పుస్తకరూపంలో తెచ్చారని.. భావితరాలకు అవి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. శేషాద్రి రచించిన పుస్తకాలను తితిదే వినియోగించుకోవాలని సూచించారు. శ్రీవారి సేవలోనే తుదిశ్వాస వీడటం శేషాద్రి అదృష్టమని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.

డాలర్ శేషాద్రి హఠాన్మరణం

TTD OSD DOLLAR SESHADRI PASSES AWAY: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం చెందారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న కార్తిక దీపోత్సవంలో పాల్గొనడానికి విశాఖ వెళ్లిన ఆయనకు సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో గుండెపోటు వచ్చింది. హుటాహుటిన రామ్‌నగర్‌లోని ఆసుపత్రికి తరలించగా... అక్కడే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాసేపటికి ఆయన భౌతికకాయాన్ని అక్కడినుంచి కేజీహెచ్​కు తరలించారు. 1978 నుంచి శ్రీవారి సేవలో శేషాద్రి తరించారు. 2007లో పదవీ విరమణ చేసినప్పటికీ.. ఆయన సేవలను గుర్తించిన తితిదే ఓఎస్డీగా కొనసాగిస్తూ వస్తోంది. మరణించే చివరి క్షణం వరకు స్వామివారి సేవలో శేషాద్రి తరించారు.

ఇదీ చదవండి

DOLLAR SESHADRI FUNERALS: నేడు డాలర్ శేషాద్రి అంత్యక్రియలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.