తిరుమల శ్రీవారిని(tirumala srivaru) నేడు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు(Cine political celebrities) దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్(Finance Minister Bugna Rajendranath), సీఎస్ సమీర్‌శర్మ(CS Sameer Sharma), తెలంగాణ గవర్నర్ తమిళిసై(Telangana Governor Tamilisai), అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ దేవేంద్ర కూమార్ జోషి, లక్షద్వీప్ పరిపాలనాధికారి ప్రఫుల్ పటేల్, పుదుచ్ఛేరి స్పీకర్ ఆర్.సెల్వం, సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి, ఎంపీ సి.ఎం.రమేష్, సినీ దర్శకుడు రాఘవేంద్రరావు (Film director Raghavendra Rao), తెలంగాణ రాష్ట్రం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు(Ts Dubaka MLA Raghunandan Rao) స్వామి వారి సేవలో పాల్గొన్నారు.
ప్రముఖులకు తితిదే ఆధికారులు స్వాగతం పలికి.. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుపతి వేదికగా జరుగనున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశానికి వచ్చిన ప్రముఖులు.. నేటి ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఇదీ చదవండి