ETV Bharat / city

మొన్న రాళ్లదాడి చేశారు.. ఇవాళ కరెంట్ నిలిపేశారు: చంద్రబాబు - చంద్రబాబు సభలో కరెంట్ నిలిపివేత

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సత్యవేడు పట్టణంలో తెదేపా అధినేత చంద్రబాబు ప్రచారం చేశారు. పార్టీ తలపెట్టిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మొన్న రాళ్ల దాడి చేశారని.. ఇవాళ కరెంట్ నిలిపేశారని ఆరోపించారు.

తెదేపా అధినేత చంద్రబాబు
chandrababu fiers on ycp govt
author img

By

Published : Apr 14, 2021, 7:05 PM IST

Updated : Apr 14, 2021, 8:35 PM IST

తెదేపా అధినేత చంద్రబాబు

వైకాపా నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. సత్యవేడు పట్టణంలో ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. బహిరంగ సభ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేయటంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న రాళ్లదాడి చేశారని.. ఇవాళ కరెంట్ నిలిపారని ఆక్షేపించారు. తాను వెళ్లేచోట కరెంటు కట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారని చంద్రబాబు ఆరోపించారు. సభలో రాళ్లు వేస్తే దానికి తానే ఆధారాలు ఇవ్వాలని చెప్పడమేంటని ప్రశ్నించారు.

వైకాపా రెండేళ్ల పాలనలో అభివృద్ధి ఏమైనాా జరిగిందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలను గెలిపించాలని కోరారని.. కానీ ఇవాళ జగన్ తన కేసుల కోసం ఎంపీలను అమ్ముకున్నారని దుయ్యబట్టారు. నాసిరకం మద్యం బ్రాండ్లు అమ్మి ప్రజాధనాన్ని దండుకొంటున్నారని విమర్శించారు. తన పోరాటం పదవి కోసం కాదని.. రాష్ట్ర భవిష్యత్తు కోసమని స్పష్టం చేశారు.

నాడు సమైక్యాంధ్ర అభివృద్ధికి విజన్ 2020 రూపొందించా.. నవ్యాంధ్ర అభివృద్ధికి విజన్ 2029 తయారుచేశా. శ్రీసిటీలోని 180 పరిశ్రమల్లో 90 మా పాలనలోనే వచ్చాయి. రూ.4 వేల కోట్లతో హీరో మోటార్స్ తీసుకువచ్చాం. మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాళ్లు వేస్తున్నారు. రైతు కూలీల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. నిత్యావసరాల ధరలు పెరిగాయి, పెట్రోల్ ధరలు పెంచారు. మన రాష్ట్ర ఆదాయం పక్క రాష్ట్రాలకు తరలిపోతోంది. మూర్ఖపు ముఖ్యమంత్రితో రాష్ట్రం నాశనమవుతోంది. కరోనా వైరస్ కంటే జగన్‌ వైరస్ భయంకరమైంది. కరోనాకు వ్యాక్సిన్ ఉంది.. జగన్ వైరస్‌కు వ్యాక్సిన్‌ లేదు. రాష్ట్రాన్ని కాపాడుకునే అవకాశం తిరుపతి ప్రజలకు వచ్చింది. - చంద్రబాబు, తెదేపా అధినేత

మాజీ మంత్రి వివేకానందరెడ్డిని ఎవరు చంపారో ఇప్పటికీ తేల్చలేదన్నారు చంద్రబాబు. తండ్రి హత్యపై వివేకా కుమార్తె అడుగుతున్నా జగన్ రెడ్డి చెప్పడం లేదని దుయ్యబట్టారు. బాబాయి హంతకులను గుర్తించలేని, చెల్లెలు మాటలు పట్టించుకోని వ్యక్తి మనకు అవసరమా అనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలని చంద్రబాబు కోరారు.

ప్రజలతో మాట్లాడించిన చంద్రబాబు

సత్యవేడు సభలో ప్రజలకు మాట్లాడే అవకాశం ఇచ్చారు చంద్రబాబు. నాగలాపురం, అరణియార్ ప్రాజెక్టు నుంచి ఇసుక తరలిపోతోందని ప్రజలు తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇసుక తరలిస్తున్నారని పేర్కొన్నారు. చీఫ్ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి తన తమ్ముడితో ఇసుక తరలిస్తున్నారని ప్రజలు చంద్రబాబుకు తెలిపారు.

ఇదీ చదవండి

షర్మిల దీక్షకు.. హైదరాబాద్ పోలీసుల అనుమతి

Last Updated : Apr 14, 2021, 8:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.