తమ పార్టీ శ్రేణులపై వేధింపులు ఆపాలంటూ తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డికి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలో తెదేపా పోలింగ్ ఏజెంట్లు, సానుభూతిపరులపై రౌడీషీట్లు తెరవడాన్ని తప్పుబట్టారు. 2019 సాధారణ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం జరిగిన సంఘటనల్లో.. కావాలనే తమ నేతలపై కేసులు పెట్టారన్నారు. ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు తగవని చెప్పారు. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 9 మంది తెదేపా ఏజెంట్లు, సానుభూతిపరులపై కేసులు నమోదు చేశారని లేఖలో వివరించారు.
కౌన్సిలింగ్ పేరుతో తెదేపా నేతలను పోలీస్ స్టేషన్ కి పిలిచి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెదేపా కార్యకర్తలను అదుపులోకి తీసుకోకపోతే వైకాపా కార్యకర్తలు పోలీసులను బెదిరిస్తున్నారన్నారు. స్థానిక వైకాపా నాయకులకు కొందరు పోలీసులు అనుకూలంగా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: