కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కరోనా కారణంగా గత ఏడాది స్వామివారిని దర్శించుకోలేకపోయానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. యావత్ ప్రపంచానికి భారత్ తన శక్తిని చాటి చెప్పిందన్న పీయూష్ గోయల్.. కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొంటున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే 150 దేశాలకు ఔషధాలు సరఫరా చేశామన్నారు. ప్రస్తుతం 75 దేశాలకు భారత్ వ్యాక్సిన్‌ను అందిస్తోందని చెప్పారు.
తిరుపతి రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయన్న పీయూష్.. మరింతమంది భక్తులు వచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందని వివరించారు. తిరుపతి స్వామి వారి దర్శనానంతరం పీయూష్... తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. గోయల్ దంపతులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందించారు. కేంద్రమంత్రితో పాటు అమ్మవారి సేవలో రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: