తిరుమలలో శ్రీవారి రూ.300 దర్శన టికెట్లను ట్రావెల్ ఏజెంట్లకు అక్రమంగా విక్రయించిన దళారులపై పోలీసులు కేసు నమోదు(CASE FILED ON TICKETS BLACK MARKETERS ) చేశారు. ఏడు సుపథం టికెట్లను దళారులు రూ.35 వేలకు విక్రయించినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో తితిదే ఉద్యోగితో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదైంది. దళారులు ఈ నెల 23న దర్శన టికెట్లను ట్రావెల్ ఏజెంట్లకు విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. టోకెన్ల తనిఖీ సమయంలో అనుమానం రావడంతో విజిలెన్స్ అధికారులు విచారణ జరపగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఇదీ చదవండి:
CJI ON TTD : శ్రీవారి సేవల్లో తప్పులు జరుగుతున్నాయన్న ఫిర్యాదుపైఏం చేశారు?: సీజేఐ