ETV Bharat / city

తిరుపతిలో మరో బాలుడు అదృశ్యం.. పోలీసులకు ఫిర్యాదు - బాలుడి అదృశ్యం

Boy missing: తిరుపతిలో తితిదే ఉద్యోగి కుమారుడు అదృశ్యమయ్యాడు. మంగళవారం ఉదయం నుంచి తన కుమారుడు కనిపించటం లేదని బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తిరుపతిలో మరో బాలుడు అదృశ్యం
తిరుపతిలో మరో బాలుడు అదృశ్యం
author img

By

Published : Jun 1, 2022, 10:02 PM IST

Tirupati News: తిరుపతిలో మరో బాలుడి అదృశ్యం కలకలం రేపుతోంది. తన కుమారుడు వంశీకృష్ణ కనిపించటం లేదని అలిపిరి పోలీస్ స్టేషన్​లో తండ్రి సురేశ్ ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన వంశీకృష్ణ.. ఇంటికి తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. తితిదే టికెట్ కౌంటర్​లో పని చేస్తున్న బాలుడి తండ్రి సురేశ్.. చెన్నారెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు. సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.