ETV Bharat / city

తిరుమలలో మరో చిన్నారి అదృశ్యం - kidnap

తిరుమలలో మరో చిన్నారి అదృశ్యం అయ్యారు. తమిళనాడు విల్లుపురానికి చెందిన మహావీర్, కౌశల్య దంపతుల కుమారుడిని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారు.

కొండపై బూచోళ్లు
author img

By

Published : Mar 17, 2019, 1:41 PM IST

తిరుమలలో మరో అదృశ్యం కేసు కలకలం రేపింది. కొన్ని రోజుల క్రితం ఇలాంటి సంఘటన జరిగింది. పోలీసులు చాలా వేగంగా స్పందించి రోజుల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారు. ఇప్పుడూ అలాంటి కేసు మరొకటి నమోదైంది.

ఇన్నాళ్లూ దర్శనానికి వచ్చిన భక్తుల పిల్లలే అదృశ్యమయ్యేవారు. ఇప్పుడు ఏకంగా అక్కడ వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తి కుమారుడినే గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారు. రాత్రి అంతా కలిసే నిద్రపోయామని... ఉదయాన్నే లేచి చూసేసరికి తమ చిన్నారి కనిపించడం లేదని తమిళనాడుకు చెందిన దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తమిళనాడు విల్లుపురానికి చెందిన మహావీర్, కౌశల్య దంపతులు కొన్ని రోజులుగా తిరుమలలో నివాసం ఉంటున్నారు. చిరు వ్యాపారం చేసుకొని జీవిస్తున్నారు. వీరికి మూడు నెలల బాలుడు వీరేష్​ ఉన్నాడు. రాత్రికి రాత్రే తమ చిన్నారిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయేసరికి ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు.

వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు... విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజ్​ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. గత నేరస్తుల వివరాలు ఆరా తీస్తున్నారు. అధైర్యపడొద్దని బిడ్డను వెతికి పట్టుకుంటామని తల్లిదండ్రులకుధైర్యం చెబుతున్నారు.

తిరుమలలో అప్పడుప్పుడు జరుగుతున్న అపహరణ కేసులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా... ఈ కిడ్నాప్​లకు అడ్డుకట్ట పడటం లేదని భక్తులు వాపోతున్నారు.

తిరుమలలో మరో చిన్నారి అదృశ్యం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Christchurch - 17 March 2019
1. Tilt down from roof to congregation gathered at Christchurch Transitional Cathedral
2. Congregation receiving communion
3. Onlookers at back of church
4. Little girl and parishioner take signs to church doors
5. Child making peace/love signs
6. Close up girl making signs
7. Girls placing signs on church windows
STORYLINE:
New Zealanders attended church services on Sunday to pray for the vcitims of the mosque shootings.
The death toll in the massacres at two New Zealand mosques rose to 50 on Sunday after police found another victim while removing bodies from the crime scenes.
The shootings suspect, Brenton Harrison Tarrant, appeared in court on Saturday amid strict security, shackled and wearing all-white prison garb, and showed no emotion when the judge read him one murder charge
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.