గత పార్లమెంట్ ఎన్నికల ఓటమితోనే ప్రతిపక్షాలు పౌరసత్వ సవరణ చట్టంపై అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయని భాజపా జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ కో ఇన్ఛార్జి సునీల్ దియోధర్ ఆరోపించారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం తిరుపతి విచ్చేసిన ఆయన జన జాగరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ భవిష్యత్ కోల్పోతామన్న భయంతో విపక్షాలు...అసత్యాలు ప్రచారం చేసి చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. సీఏఏతో దేశంలోని ఏ పౌరుడు పౌరసత్వాన్ని కోల్పోరని స్పష్టం చేశారు.
ప్రతిపక్షాలు పౌరసత్వ సవరణ చట్టంపై ఎన్నో గందరగోళాలు స్పష్టిస్తున్నాయి. ఎందుకంటే వారు ఎన్నికల్లో ఓడిపోయి..... రాజకీయ భవిష్యత్తుపై కలత చెందుతున్నారు. అందువల్ల ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారు. సీఏఏ వల్ల దేశంలోని ఏ పౌరుడూ పౌరసత్వాన్ని కోల్పోడు- సునీల్ దియోధర్
ఇదీ చదవండి:సీఏఏతో ముస్లింలకు ఇబ్బందిలేదు:టీజీ వెంకటేశ్