Hanuman birthplace Bhoomi Puja : తిరుమల అంజనాద్రిలో హనుమంతుని జన్మస్థలానికి.. ఈ నెల 16న మాఘ పౌర్ణమి నాడు భూమి పూజ నిర్వహించనున్నట్లు తితిదే ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో అదనపు ఈఓ ధర్మారెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు.
తిరుమలలోని ఆకాశగంగ సమీపంలోని అంజనాద్రిని శ్రీ ఆంజనేయుడి జన్మస్థలంగా భౌగోళిక, పౌరాణిక, శాస్త్రోక్తమైన ఆధారాలతో తితిదే ప్రకటించిందన్నారు. ఆ ప్రాంతాన్ని పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయడం, సుందరీకరణ చేపట్టేందుకు భూమిపూజ నిర్వహించనున్నట్లు తెలిపారు. విశాఖ శారదా పీఠం పీఠాధిపతి స్వరూపానంద సరస్వతీ స్వామి, అయోధ్య శ్రీ రామజన్మ భూమి ఆలయ నిర్మాణ ట్రస్టు కోశాధికారి స్వామి గోవింద్ దేవ్గిరి మహారాజ్, చిత్రకూట్ పీఠాధిపతి రామభద్రాచార్యులు, కోటేశ్వరశర్మ తదితర ఆధ్యాత్మిక ప్రముఖులను ఈ ఉత్సవానికి ఆహ్వానించినట్లు తెలిపారు.
కరోనా పరిస్ధితులు సమీక్షించుకుని.. ఈ నెల 15 నుంచి తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీపై నిర్ణయం తీసుకుంటామని ఈవో తెలిపారు.
ఇదీ చదవండి