తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో తితిదే ఆయుధ పూజ నిర్వహించింది. అన్న ప్రసాద భవనంలోని యంత్రాలకు, తయారీ వస్తువులకు, వడ్డించే సామాన్లకు పూజలు చేశారు. అన్నప్రసాదం ట్రస్టుకు రూ.1,150 కోట్లు డిపాజిట్లు ఉన్నాయనీ.. ఈ ఏడాది ఇప్పటి వరకు 100 కోట్లకు పైగా విరాళాలు అందాయని.. తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. డిపాజిట్ల ద్వారా 79 కోట్ల రూపాయల వడ్డీ వస్తున్నట్లు చెప్పారు. నిత్యం లక్ష మందికి పైగా భక్తులకు ఈ ట్రస్టు ద్వారా అన్నప్రసాదాలు అందజేస్తున్నట్లు వివరించారు.
ఇవీ చదవండి: