ETV Bharat / city

తిరుమల బ్రహ్మోత్సవాలకు.. విస్తృత ఏర్పాట్లు - ఈ నెల 30 నుంచి ఆక్టోబర్‌ 8వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. బ్రహ్మోత్సవాల నిర్వహణపై పలుమార్లు సమావేశమైన అధికారులు.. యాత్రికులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.

tirumala-BRAMHOTSAVMS
author img

By

Published : Sep 17, 2019, 12:59 PM IST

తిరుమల బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

సప్తగిరుల్లో కొలువైన కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుని వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 30 నుంచి అక్టోబర్‌ 8వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు శ్రీనివాసుడు.. అమ్మవార్లతో కలసి ఉదయం, రాత్రి వివిధ వాహన సేవలో తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. చిన్నశేష, పెద్దశేష, సింహ, ముత్యపు పందిరి, కల్పవృక్ష, సర్వభూపాల, మోహినీ అవతారం, గరుడవాహనం, హనుమంతవాహనం, స్వర్ణరథం, గజవాహనం, సూర్యప్రభ, చంద్రప్రభ, రథోత్సవం, అశ్వవాహన సేవలపై స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ దర్శనమిస్తారు.

ముమ్మర ఏర్పాట్లు...

దసరా సెలవుల్లో ఉత్సవాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తలు వస్తారని తితిదే భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఉన్నతాధికారులతో సమావేశమైన ఈవో అనిల్ కుమార్ సింఘాల్... గత అనుభవాల నేపథ్యంలో కీలక సూచనల చేశారు. బ్రహ్మోత్సవాల కోసం చేస్తున్న పనులన్నీ ఉత్సవాలకు వారం రోజుల ముందే పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ వైర్లతో ఇబ్బందులు తలెత్తకుండా... తిరువీధుల్లో భూగర్భ కేబులింగ్ వ్యవస్థను రూపొందిస్తున్నారు. పుష్కరిణికి ఇత్తడి గేట్ల ఏర్పాటుతో పాటు... సుందరీకరణ పనులను పూర్తిచేయడానికి కృషి చేస్తున్నారు.

నిఘా నీడలో తిరువీధులు

వాహన పేవలను దర్శించుకునేందుకు లక్షలాదిగా తరలివచ్చే యాత్రికులకు పటిష్టభద్రతా చర్యలు చేపట్టేందుకు పోలీసులు దృష్టి సారించారు. వాహన సేవ సమయంలో ఎలాంటి తోపులాట జరగకుండా ప్రత్యేక దృష్టి సారించారు. తిరు వీధుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కంట్రోల్ రూమ్​ల నిరంతరం పర్యవేక్షించే విధంగా వ్యవస్థను రూపొందిస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో మూడు వేల మంది పోలీసుల బలగాలను బందోబస్తుకు వినియోగించనున్నారు. పార్కింగ్ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నారు. గొలుసు దొంగతనాలను ఆరికట్టేందుకు ప్రత్యేక సిబ్బంది నియమించారు.

బ్రహ్మోత్సవాల సమయంలో వీఐపీ దర్శనాలు, అర్జిత సేవలతో పాటు అన్నిరకాల ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు. భక్తులందరికీ వాహన సేవల దర్శనంతో పాటు ఆలయంలోని మూలమూర్తి దర్శనం త్వరగా పూర్తయ్యే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

Intro:ATP :- దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. అనంతపురంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. వెనుకబడిన వర్గాలకు చెందిన నరేంద్ర మోడీ, ప్రధాన మంత్రి స్థాయికి ఎదిగిన తీరు ను ప్రజలకు వివరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాల్లో భాగమైన స్వచ్ఛభారత్, అన్నదాన కార్యక్రమం, వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. నరేంద్ర మోడీ జీవిత చరిత్రపై పుస్తకాలను, ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తనను సేవా కార్యక్రమాల కోసం రాష్ట్ర కన్వీనర్ గా నియమించినట్లు తెలిపారు.

Body:ఈనెల 19న జిల్లాలో 73 వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున నిర్వహించలేదని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సూర్య నారాయణ ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

బైట్..... రావెల కిషోర్ బాబు, మాజీ మంత్రి.

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.