మున్సిపల్ ఎన్నికల్లో అధిక శాతం పోలింగ్ అయ్యేలా చర్యలు చేపట్టామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. ఎన్నికల నిర్వహణపై రాయలసీమ, నెల్లూరు జిల్లా అధికారులతో తిరుపతిలో సమీక్షించిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో వాలంటీర్ల వినియోగం ఉండదని పునరుద్ఘాటించారు. మున్సిపల్ సిబ్బందే ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలన్నారు. హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి ఓటర్ల అనుమానాలు నివృత్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.
సీఈసీ ప్రకటించిన ఎన్నికల నియమావళి రాష్ట్రంలోనూ అమలు చేస్తామని ఎస్‌ఈసీ వెల్లడించారు. అభ్యర్థితోపాటు ఐదుగురికి మించి ఇంటింటి ప్రచారం చేయకూడదన్నారు. మద్యం, డబ్బు పంపిణీ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ రేషన్ వాహనాలు దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు.
'మున్సిపల్ ఎన్నికల్లో మొబైల్ స్క్వాడ్ చురుకుగా పనిచేస్తాయి. ఎన్నికలను ప్రభావితం చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంటుంది. బలవంతపు ఉపసంహరణ కేసులను స్వయంగా అభ్యర్థి వచ్చి అడిగితే పరిశీలిస్తాం. నామినేషన్‌ను అడ్డుకున్న కేసుల్లో రుజువులు చూపిస్తే వారి విషయాన్ని పునఃపరిశీలిస్తాం'- నిమ్మగడ్డ రమేశ్ కుమార్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్
ఇదీ చదవండి