తిరుపతి ఎంపీ స్థానానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో దళితులను ఓట్లు అడిగే హక్కు వైకాపా, తెదేపా, భాజపాకు లేదని పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో తిరుపతి పార్లమెంట్ ఎన్నికకు సంబంధించి కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో దళితులు, మైనారిటీలపై దాడులు జరుగుతున్నా జగన్ నోరు విప్పడం లేదని విమర్శించారు. అలాంటివారు ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. తిరుపతి ఎంపీ స్థానాన్ని తప్పక కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి