తిరుమలలో నకిలీ టిక్కెట్ల వ్యవహారం వెలుగు చూసింది. శ్రీవారి దర్శన టిక్కెట్ల పేరుతో దళారులు మోసానికి పాల్పడ్డారని అలిపిరి పీఎస్‌లో తితిదే నిఘా, భద్రతా విభాగం ఫిర్యాదు చేసింది. తమిళనాడు భక్తుల చరవాణికి దర్శన టికెట్ల నకిలీ మెసేజ్‌లు వచ్చాయని పేర్కొంది. అలిపిరి టోల్‌గేట్ వద్ద మెసేజ్ చూపిస్తే కొండపైకి వెళ్లవచ్చని మోసం చేశారని ఫిర్యాదులో తెలిపారు. దళారులు మోసం చేశారని తమిళనాడు భక్తులు గుర్తించినట్లు తితిదే నిఘా విభాగం వివరించింది.
ఇదీ చదవండి: MINISTER AVANTHI SRINIVAS: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి