ETV Bharat / city

'మా వాడు చనిపోలేదు.. డాక్టర్లే నిర్లక్ష్యంతో చంపేశారు'

వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ చనిపోయాడంటూ తిరుపతి స్విమ్స్​ పద్మావతి ఆస్పత్రి వద్ద మృతుడి బంధువులు ఆందోళన చేశారు. ఆక్సిజన్​ మాస్క్​ పెట్టాలంటూ ఆస్పత్రి సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

agitation in front of the padmavati covid hospital
ఆస్పత్రి ఎదుట ఆందోళన
author img

By

Published : Jun 13, 2021, 12:34 PM IST

తమ కుమారుడి చావుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ తిరుపతి స్విమ్స్​ పద్మావతి కొవిడ్​ ఆస్పత్రి ఎదుట మృతుడి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేశారు. చిత్తూరు జిల్లా కలికిరికి చెందిన 28 ఏళ్ల యువకుడికి కరోనా సోకగా.. కొద్ది రోజులుగా పద్మావతి కొవిడ్​ ఆస్పత్రిలో చికిత్స పొందాడు.

పరిస్థితి విషమించి... ఈ రోజు ఉదయం మరణించాడు. ఆక్సిజన్​ మాస్క్​ సరిగా లేకపోయినా.. సిబ్బంది పట్టించుకోవట్లేదని తమ బిడ్డ ఫోన్​ చేశాడని మృతుని తండ్రి తెలిపారు. వెంటనే తాము ఆస్పత్రి సిబ్బందికి సమాచారం ఇచ్చినా స్పందించలేదంటూ రోదించారు.

ఇదీ చదవండి:

పాము కాటుకు గురై బాలిక మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.