- ఆగ్రహజ్వాల
విశాఖ ఉక్కు ఆందోళన ఉద్రిక్తతకు, తోపులాటకు దారితీసింది. ఉక్కు పరిశ్రమ పరిపాలనా కార్యాలయం వద్ద కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. డైరెక్టర్ ఫైనాన్స్ వేణుగోపాల్ వాహనాన్ని నిరసనకారులు చుట్టుముట్టారు. వేణుగోపాల్‌రావును ముట్టడి నుంచి తప్పించేందుకు పోలీసుల యత్నించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మరోసారి ప్రధానికి లేఖ
విశాఖ ఉక్కు పరిశ్రమను వందశాతం ప్రైవేటీకరిస్తామని.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చిచెప్పిన నేపథ్యంలో.. ప్రధాని వద్దకు అఖిలపక్షంతోపాటు కార్మిక నాయకుల్ని తీసుకెళ్లాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీని సమయం కోరుతూ లేఖ రాశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- దాడి దారుణం: చంద్రబాబు
అమరావతి మహిళలపై దాడి చేయడం దారుణమని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. హక్కు కల్పించాలని కోరితే భౌతిక దాడులు చేస్తారా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతి రైతులతో ప్రభుత్వం తరఫున ఒప్పందం చేసుకున్నామని... అమరావతి రైతులతో మార్చుకోలేని ఒప్పందం జరిగిందని వివరించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- కౌంట్‌డౌన్ స్టార్ట్..!
రాష్ట్రంలో పుర, నగరపాలక సంస్థలకు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. పురఎన్నికల ప్రశాంత నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతి పట్టణ ఎన్నికను జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షించేలా సిద్ధం చేసింది. కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లు వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తారని ఎస్ఈసీ స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- సీఎం రాజీనామా
ఉత్తరాఖండ్ రాజకీయాల్లో కీలక మార్పులు జరిగాయి. సీఎం త్రివేంద్ర సింగ్ రావత్.. తన పదవికి రాజీనామా చేశారు. అసమ్మతి ఎదురైన కారణంగా ఆయన సీఎం పదవి నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'టాలీవుడ్'లో చీలిక!
బంగాల్లో తొలిసారి అధికారంలోకి రావాలని ఈసారి గట్టి ప్రయత్నం చేస్తోంది భారతీయ జనతా పార్టీ. మరోవైపు.. హ్యాట్రిక్ కొట్టాలని ఊవిళ్లూరుతోంది అధికార తృణమూల్ కాంగ్రెస్. ఈ క్రమంలో ఆ రాష్ట్ర రాజకీయం.. ఇప్పుడు బంగాల్ సినీ పరిశ్రమ(టాలీవుడ్) చుట్టూ తిరుగుతోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'భారత్ పాత్ర భేష్'
కరోనా టీకాను అభివృద్ధి చేసి..ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తున్నందుకు గానూ అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ముఖ్య ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ భారత్‌పై ప్రశంసలు కరిపించారు. భారత్‌ను ప్రపంచ వ్యాక్సిన్ హబ్‌గా ఆమె అభివర్ణించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- స్వల్ప పెరుగుదల
బంగారం, వెండి ధరలు మంగళవారం స్పల్పంగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.35 పెరిగింది. వెండి ధర కిలోకు రూ.553 పుంజుకుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఫుల్‌జోష్‌లో టీమ్ఇండియా
అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు టీమ్ఇండియా సన్నద్ధమవుతోంది. హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ సహా యువ ఆటగాళ్లు వచ్చి చేరడం వల్ల శిక్షణా శిబిరంలో సందడి నెలకొంది. మైదానంలో ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో పంచుకుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ముఖ్య ఉద్దేశం అదే
చదువుకున్న యువత వ్యవసాయం చేస్తే ఎలాంటి మార్పులు వస్తాయో తెలియజేయడమే తన సినిమా 'శ్రీకారం' ముఖ్య ఉద్దేశమని తెలిపారు హీరో శర్వానంద్. యువత ఈ రంగాన్ని వృత్తిగా ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ చిత్రం మార్చి 11న విడుదల కానుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.