ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3 PM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

ప్రధాన వార్తలు @ 3 PM

3pm top news
ప్రధాన వార్తలు @ 3pm
author img

By

Published : May 12, 2021, 3:00 PM IST

  • అవగాహనా లోపం

టీకాపై ప్రజల్లో అవగాహన లోపిస్తోంది. మొదటి డోసు వేసుకున్నా తరువాత రెండో డోసుకు ఎన్ని రోజులు గడువు ఉందో తెలియకపోవడంతో వ్యాక్సిన్​ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. కొవిషీల్డ్‌ తొలి డోసు వేసుకున్న 42 రోజుల తర్వాత, కొవాగ్జిన్ తొలిడోసు వేసుకున్న 28 రోజుల తర్వాతే రెండో డోసుకు అర్హులు అవుతారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • రుయా ఘటనపై ఫిర్యాదు

రుయా ఘటనపై తిరుపతి ఆర్డీవోకు భాజపా ఫిర్యాదు చేసింది. అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించింది. మృతుల లెక్కల్లో తప్పిదాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • వాహనాలు నిలిపివేత..

తెలంగాణ సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్ తెలంగాణ చెక్ పోస్ట్ వద్ద ఏపీ నుంచి వచ్చే వాహనాలను పోలీసులు నిలిపివేస్తున్నారు. అత్యవసరంగా వెళ్లే వాహనాలను, ఈ-పాస్ ఉన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • వాడిపోతున్న పూల వ్యాపారం!

కరోనా మహమ్మారి పూలవ్యాపారులను దెబ్బతిసింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావటంతో.. రైతులు చాలా ప్రాంతాల్లో పూలతోటలను పెంచుతున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా శుభకార్యాలన్నీ నిలిచిపోవటంతో.. విక్రయాలు మందగించాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఉత్పరివర్తనం చెందిన కరోనా

భారత్​లో వెలుగుచూసిన బి.1.617 రకం కరోనా... 44 దేశాల్లో గుర్తించినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ కరోనా రకం.. ఆందోళకరమైన వైరస్ రూపాంతరంగా అభివర్ణించింది. అయితే, ఈ ఉత్పరివర్తం చెందిన ఈ వైరస్ రకాన్ని 'భారత్ స్ట్రెయిన్​'గా మీడియా సంస్థలు పేర్కొనడాన్ని కేంద్రం తప్పుబట్టింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • గంగా నదిలో శవాల వెనుక ఉన్నది ఇతడే!

బిహార్​ గంగా నది పరివాహక ప్రాంతంలో కుప్పలుగా మృతదేహాలు వెలుగు చూసిన ఘటన మరువక ముందే.. ఇదే తరహా ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. ఉత్తర్​ప్రదేశ్​లోని బారా నగర్​ పంచాయతీ ప్రాంతంలో ఉండే గంగానదిలో శవాలను పారేస్తూ ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • విస్తరణకు నిర్ణయం

సూయిజ్ కాలువ లోతు, వెడల్పు పెంచాలని ఈజిప్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇస్మాయిలియా నగరంలో జరిగిన సమావేశంలో సూయిజ్ కాలువ పర్యవేక్షణ అధికారి లెఫ్టినెంట్ జనరల్ ఒసామా రాబీ వెల్లడించారు. మరోవైపు.. సూయిజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయి భారీ నష్టాన్ని కలిగించిన ఎవర్ గివెన్ నౌకను ఈజిప్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • కార్లకు కరోనా సెగ

కరోనా రెండో దశ దెబ్బకు కార్ల విక్రయాలు గత నెల 10 శాతం తగ్గాయి. ద్విచక్ర వాహనాల విక్రయాలు ఏకంగా 33 శాతం పడిపోయాయి. ఏప్రిల్ నెలకు గానూ వాహన విక్రయాలపై సియామ్ వెల్లడించిన గణాంకాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • అంపైర్​పై ఆగ్రహం

టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్​ ఇటాలియన్​ ఓపెన్​లో విజయం సాధించాడు. అమెరికా ఆటగాడు టేలర్ ఫ్రిట్జ్​ను 6-3,7-6 (5) తేడాతో ఓడించాడు. అయితే.. మ్యాచ్​ జరుగుతుండగా సహనం కోల్పోయి అంపైర్​పై అరిచాడు జకోవిచ్. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'నాకూ ఇబ్బందులే'

టాలీవుడ్​తో పాటు బాలీవుడ్​లోనూ అవకాశాలతో దూసుకెళ్తోంది నటి శ్రుతి హాసన్. తాజాగా లాక్​డౌన్​పై స్పందించిన ఈమె తాను కూడా కొంత వరకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలున్నాయని తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.