విశాఖ ఉక్కు పరిశ్రమ అంశంపై అన్ని పార్టీలు అహాలు పక్కకు పెట్టాలని... మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సూచించారు. రాజమహేంద్రవరంలో ఆయన ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. సొంత గనులిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ ఏడాదే లాభాల్లోకి వస్తుందని అభిప్రాయపడ్డారు.
ప్రధానికి సీఎం జగన్ రాసిన లేఖ వల్ల ఉపయోగం ఉండదన్న ఉండవల్లి... విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. గంటా శ్రీనివాసరావు రాజీనామాతో ఉద్యమానికి ఊపు వచ్చిందని... పార్లమెంటులో వైకాపా, తెదేపా ఏకాభిప్రాయంతో పోరాడాలని చెప్పారు.
ఇదీ చదవండి: