తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో పురపాలక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. తెదేపా, వైకాపా నేతలు నువ్వానేనా అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. మున్సిపాలిటీలో 20 వార్డులు తాము గెలుస్తామని ఇరు పార్టీల అభ్యర్థులు ధీమాతో ఉన్నారు. భాజపా-జనసేన నేతలు కూడా ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరపాలక సంస్థకు తొలిసారిగా జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రచారం ప్రారంభిస్తున్నారు. 39 డివిజన్లో సీపీఎం తరపున పోటీ చేస్తున్న సయ్యద్ అమీర్ ఉన్నీసా ఇంటింటా ప్రచారం చేశారు. పురపాలక సంఘంగా ఉన్న సమయంలో ఈ వార్డు నుంచి తమ పార్టీ ప్రాతినిధ్యం వహించి.. ఎన్నో సమస్యలకు పరిష్కరించిందని మళ్లీ గెలిపిస్తే.. మురుగునీరు, మంచినీటి సమస్యను పరిష్కరిస్తామంటూ ప్రచారం చేస్తున్నారు.
ఇదీ చదవండి: