ETV Bharat / city

ఎన్టీఆర్‌ గృహ సముదాయాలను తక్షణమే కేటాయించాలి: అఖిలపక్షం - రజమహేంద్రవరంలో అఖిలపక్షం సమావేశం

వైకాపా ప్రభుత్వం ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకుండా తాత్సారం చేయడం దారుణమని అఖిలపక్షం నేతలు మండిపడ్డారు. అప్పులు చేసి లక్షల రూపాయలు నగదు చెల్లించిన పేదలకు ఎదురుచూపులు తప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

round table
round table
author img

By

Published : Oct 26, 2020, 3:43 PM IST

తెలుగుదేశం హయాంలో నిర్మించిన పేదల గృహసముదాయాలను లబ్ధిదారులకు తక్షణం కేటాయించాలంటూ అఖిలపక్షం డిమాండ్ చేసింది. రాజమహేంద్రవరంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్ సమావేశం‌ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆధునిక సాంకేతికతో ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు కేటాయింపులు జరిగాయని.. వారు కూడా తమవంతు ప్రభుత్వానికి చెల్లించారని.. నాయకులు తెలిపారు. వైకాపా ప్రభుత్వం మాత్రం ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకుండా తాత్సారం చేయడం దారుణమనమన్నారు.

అప్పులు చేసి లక్షల రూపాయలు నగదు చెల్లించిన పేదలకు ఎదురుచూపులు తప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ గృహ సముదాయాలను తక్షణం కేటాయించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని వివిధ పక్షాల నాయకులు హెచ్చరించారు. తెలుగుదేశం, వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి; ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం రూ. కోటి ప్రోత్సాహకం: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.