ETV Bharat / city

కొండ చిలువకు 20 కుట్లతో చికిత్స - Python got 20 stitches at hanmakonda zoo

తెలంగాణలోని వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రంలోని జంతుప్రదర్శనశాలలో గాయపడిన కొండచిలువ కోలుకుంటోంది. నాలుగురోజుల క్రితం గాయపడిన కొండ చిలువకు మొత్తం 20 కుట్లు వేశారు. పూర్తిగా కోలుకోవడానికి మరో పది రోజులు పడుతుందని జూ వైద్యులు తెలిపారు.

python-curing-at-hanmakonda-zoo
python-curing-at-hanmakonda-zoo
author img

By

Published : May 23, 2020, 5:37 PM IST

కొండ చిలువకు 20 కుట్లతో చికిత్స

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండ జంతు ప్రదర్శనశాలలో గాయపడిన కొండ చిలువ కోలుకుంటోంది. జూ వైద్యులు శస్త్రచికిత్స చేసి గాయాలకు కట్టు కట్టారు. అర్బన్ జిల్లా హసన్​పర్తి చెరువులో నాలుగురోజుల క్రితం.. మత్స్యకారుల వలలో చిక్కుకుని కొండచిలువ తీవ్రగాయాల పాలైంది.

విషయం తెలుసుకున్న జంతు ప్రేమికులు.. దాన్ని జూకి చేర్చారు. వలలో ఇరుక్కుపోవడం వల్ల సగానికిపైగా తెగిపోయింది. జూ వైద్యులు రేయింబవళ్లు శ్రమించి.. ఆ పాముకు వైద్యం చేశారు. మొత్తం 20 కుట్లు వేసి కట్టుకట్టారు. ఇప్పుడిప్పుడే కాస్త ప్రాణం వచ్చి కదులుతోందని.. పూర్తిగా కోలుకోవడానికి పదిరోజులు పడుతుందని వైద్యులు తెలిపారు.

ఇవీ చూడండి:

బిడ్డ పెళ్లి లొల్లి.. తెగిన తల్లి తాళి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.