MLA Buchaiah Chowdary on PRC: గత ఎన్నికల్లో ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్.... అమల్లో మాత్రం తీవ్రంగా విఫలమయ్యారని తెలుగుదేశం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. పీఆర్సీలో జీతాలకు కోతపెట్టి..... ఉద్యోగులకు శఠగోపం పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమ్మెను పక్కదోవ పట్టించడానికి జిల్లాల పునర్విభజనకు తెరలేపారని విమర్శించారు.ప్రజలపై పన్నుల భారం వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుగానే ఉండాలన్నారు.పరిధి దాటి మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బుచ్చయ్య చౌదరి హెచ్చరించారు.
ఇదీ చదవండి : PRC: పీఆర్సీ సమ్మెలో పాల్గొనబోం:ఆర్టీసీ వైయస్సార్ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు చంద్రయ్య
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!