కాపు సామాజిక వర్గానికి చెందిన పేదింటి మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించి... వారి ఉన్నతి తోడ్పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. 45 నుంచి 60 ఏళ్ల వయసున్న వారికి ప్రతీఏటా రూ.15 వేలు ఇవ్వనున్నట్టు వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు వచ్చే ఏడాది నుంచి... సంవత్సరానికి రూ.19 వేలు ఇస్తామన్నారు. మహిళల అభ్యున్నతే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు వివరించారు.
ఉగాదికి ఇచ్చే ఇళ్ల పట్టాలను కూడా... మహిళల పేరిటే రిజిస్టర్ చేసి ఇవ్వనున్నట్టు చెప్పారు. రేషన్ కార్డును ఇకనుంచి రైస్ కార్డుగా ఇస్తామన్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు తాగునీరు అందించడానికి వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును చేపట్టనున్నట్టు తెలిపారు. ఇందు కోసం రూ.8వేల 500 కోట్లు మంజూరు అయినట్లు మంత్రి కన్నబాబు వివరించారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా... పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులను ఆధునికీకరిస్తున్నామని చెప్పారు.
ఇదీ చదవండీ...