ETV Bharat / city

సమస్యలు పరిష్కరించాలని రాజమహేంద్రవరంలో న్యాయవాదుల నిరసన - news on lawyers

రాజమహేంద్రవరంలో న్యాయవాదులు నిరసన చేపట్టారు. ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని కోరారు.

lawyers protest at rajamahendra varam
రాజమహేంద్రవరంలో న్యాయవాదుల నిరసన
author img

By

Published : Jul 6, 2020, 2:15 PM IST

రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ రాజమహేంద్రవరంలో న్యాయవాదులు నిరసన చేపట్టారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు ఇస్తామని... ఇప్పటికీ ఇవ్వలేదని భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు అన్నారు. ఆ డబ్బు ఇచ్చి ఉంటే ఈ కరోనా సమయంలో న్యాయవాదులకు ఆర్థిక ఇబ్బందులు ఉండేవి కాదన్నారు.

అదేవిధంగా జూనియర్‌ న్యాయవాదులకు నాలుగు నెలల స్టైఫండ్‌ తక్షణమే చెల్లించాలని... చనిపోయిన న్యాయవాదుల కుటుంబాలకు ఇస్తామని చెప్పిన రూ. 4 లక్షల మ్యాచింగ్‌ గ్రాంట్‌ నిధులు వెంటనే విడుదల చేయాలని ముప్పాళ్ల సుబ్బారావు డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: జులై 8న తలపెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.