తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి మధ్యలో పోలీసులు తాడు కట్టారు. రాత్రి డ్యూటీకి వస్తూ తాడు కనపడక ల్యాబ్ టెక్నీషియన్ రాజశేఖర్ బైక్‌తో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కిందపడి రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందారు. రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి 99ఎల్ స్తంభం వద్ద ఈ ఘటన జరిగింది. హెచ్చరిక బోర్డులు లేకుండా వంతెన మధ్యలో తాడు కట్టడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మీడియా రాకతో పోలీసులు హుటాహుటిన తాడును తొలగించారు.
ఇదీ చదవండీ... లాక్‌డౌన్: రాకపోకలు పూర్తిగా బంద్