fire accident at ongc site: తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండల పరిధిలోని ఓఎన్జీసీ ప్రాంగణంలో మంటలు చెలరేగాయి. కొత్తూరు సెంటర్ నుంచి మండపేట వెళ్లే రహదారి వద్ద ఈ ఘటన జరిగింది. భయాందోళనకు గురైన స్థానికులు.. అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు.
![ONGC_FAIR_](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-rjy-56-24-ongc-fair-accident-av-ap10018_24122021192116_2412f_1640353876_596.jpg)
స్థానికులు వేసిన చెత్తాచెదారం.. వేస్ట్ గ్యాస్‌తో కలవడం వల్లే మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చినట్లు ఎస్సై సోమన శివప్రసాద్ వెల్లడించారు.
ఇదీ చదవండి :
పైన అసలు బంగారం.. లోపల నకిలీ బాగోతం.. వీళ్ల మోసం మామూలుగా లేదుగా!