మాజీ ఎంపీ హర్షకుమార్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం చెరుకూరి కన్వెన్షన్ హాలులో జరిగిన కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి ఉమెన్ చాందీ, ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ సమక్షంలో హర్షకుమార్ కాంగ్రెస్లో చేరారు. ఉమెన్ చాందీ హర్షకుమార్కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు కాంగ్రెస్ శ్రేణులు నగరంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.
ఇదీ చదవండి : నివర్తో ఒక్కసారిగా పెరిగిన వరి కోత ధరలు