మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావుపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడం దారుణమని నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. చేయని తప్పుకు సెక్షన్ 3 ప్రకారం కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీసులు ప్రభుత్వ ఒత్తడికి తలొగ్గి వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారని ఆక్షేపించారు. దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను వైకాపా ప్రభుత్వం తెదేపా నాయకుల్ని అరెస్ట్ చేసేందుకు ఉపయోగించుకుంటోందని విమర్శించారు.
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారారంలో రిమాండ్లో ఉన్న దేవినేని ఉమను పరామర్శించేందుకు ఆమె నందిగామ నియోజకవర్గ తెదేపా నాయకులతో కలిసి జైలు వద్దకు వచ్చారు. కొవిడ్ నిబంధనలు అమలులో ఉన్నాయంటూ జైలు సిబ్బంది ఆమెను లోపలికి అనుమతించలేదు.
ఇదీ చదవండి