ETV Bharat / city

సామాజిక దూరంపై.. పట్టింపు లేదా? - రేషన్ కోసం సామాజిక దూరం పాటించని అనంతపురం ప్రజలు

ఉచిత బియ్యం, కందిపప్పు పంపిణీ గందరగోళంగా మారింది. సరుకుల కోసం జనం ఎగబడుతున్నారు. సామాజిక దూరం పాటించాలన్న నింబధనను నీరుగారుస్తున్నారు. రేషన్ తమకు అందుతుందో లేదో అన్న భయంతో డిపోలకు ఉదయాన్నే వచ్చి క్యూ కడుతున్నారు.

Distribution of ration without following social distance at chirala in prakasham, thuni in eastgodavari and madakasira in ananthapuram

author img

By

Published : Mar 30, 2020, 12:38 PM IST

సామాజిక దూరం నిబంధన పట్టని ప్రజలు

ఉచిత రేషన్‌ పంపిణీలో భాగంగా సరుకులు అందుకునేందుకు ఆరాటం చూపిస్తున్న ప్రజలు.. సామాజిక దూరం నిబంధనను గాలికి వదిలేస్తున్నారు. వారం నుంచి ఇళ్లకే పరిమితమైన జనం.. బియ్యం, కందిపప్పు కోసం ఒక్కసారిగా రోడ్లపైకి వస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచే రేషన్‌ డిపోల వద్ద బారులు తీరుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని తుని, అనంతపురం జిల్లా మడకశిర, ప్రకాశం జిల్లా చీరాలలోని రేషన్​ డిపోలు రద్దీగా మారాయి. అధికారులు, వాలంటీర్లు సైతం జనాన్ని అదుపు చేయలేకపోతున్నారు.

ఒక రోజు ఆలస్యమైతే సరకులు అయిపోతాయేమో, మళ్లీ వస్తాయో రావో అనే భయంతో.. జనం ఇలా ఎగబడుతున్నారు. నిత్యావసర వస్తువుల విషయంలో సామాజిక దూరాన్ని.. దూరం పెడుతున్నారు. రేషన్ దుకాణాల వద్ద పోలీసులు లేని కారణంగా లాక్​డౌన్ అమలు కావటం లేదు. మరి కొందరు తెచ్చిన సంచులను వంతులవారీగా వరుసలో పెట్టి పక్కన నిల్చుంటున్నారు. డిపోలకు జనం పోటెత్తుతున్న కారణంగా.. సర్వర్లు మొరాయిస్తున్నాయి.

కరువైన ధరల పట్టిక..

ప్రతి దుకాణంలో ధరల పట్టిక ఉండాలనే ప్రభుత్వ నిబంధనలను... వ్యాపారులు ఎవరూ పాటించటం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు అమాంతంగా పెరిగినా క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ కొరవడిందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి:

ఉచిత రేషన్ పంపిణీ.. క్యూకట్టిన జనం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.