ముఖ్యమంత్రి జగన్ ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు రాజమహేంద్రవరం చేరుకుంటారు. నగర జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో ఆయన దిగుతారు. అక్కడినుంచి 10 గంటల 50 నిమిషాలకు జాంపేట చేరుకుని... దిశ పోలీస్‌స్టేషన్, వన్ స్టెప్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అక్కడే కాసేపు అధికారులతో మాట్లాడతారు. అనంతరం 11 గంటల 20 నిమిషాలకు నన్నయ విశ్వవిద్యాలయానికి చేరుకుంటారు. అక్కడ దిశ చట్టంపై నిర్వహించే కార్యశాలలో పాల్గొని దిశ యాప్‌ను ప్రారంభిస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 18 దిశ పోలీస్‌స్టేషన్ల అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం 13 జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. 12 గంటల 45 నిమిషాలకు రాజమహేంద్రవరంలోని ఎంపీ మార్గాని భరత్ నివాసానికి సీఎం జగన్ చేరుకుంటారు. ఒంటి గంట 10 నిమిషాలకు తాడేపల్లి బయలుదేరతారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా.. పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రి విశ్వరూప్, ఎంపీ మార్గాని భరత్, వైకాపా నేతలు ఏర్పాట్లను పరిశీలించారు.
ఇదీ చదవండి :