సీఎం జగన్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా వైకాపా ఆధ్వర్యంలో.. రాజమహేంద్రవరంలో మహిళలు పాదయాత్ర చేపట్టారు. మున్సిపల్ స్టేడియం నుంచి పుష్కర్‌ఘాట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. పుష్కర ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన భారీ చిత్రపటానికి మంత్రులు అంజాద్‌బాషా, నారాయణస్వామి, తానేటి వనిత పూలమాలలు వేశారు. పాదయాత్రకు అధికసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు
ఇదీ చదవండి: మూడు రోజుల పాటు అట్టహాసంగా ఇళ్ల పట్టాల పంపిణీ